గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో 25 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
గిద్దలూరు టిడిపి కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి 25 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందినందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.22 లక్షలకు పైగా విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేశారని తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని వెల్లడించారు