కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రాన్ని శుక్రవారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆకస్మికంగా సందర్శించారు. రైతులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలుదారులు కనీసం కేజీ పొగాకు 200 రూపాయలైనా తగకుండా ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తుందని అంతర్జాతీయంగా ఏర్పడ్డ సమస్యల వల్ల పొగాకు ధరలు పాతాళానికి పడిపోయినట్లు అన్నారు. రైతులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.