కళ్యాణదుర్గం: ములకలేడు గ్రామంలో తాగునీటి సమస్య ను పరిష్కరించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు, కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో గత కొంతకాలంగా తాగునీటి సమస్య నెలకొంది. తాగునీటి కోసం గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. గ్రామస్తులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్పందించారు. గ్రామంలో రెండు చోట్ల బోర్లు వేయించారు. సమృద్ధిగా నీళ్లు పడ్డాయి. తాగునీటి సమస్య పరిష్కారమైంది. తాగునీటి సమస్యలు పరిష్కరించినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.