దర్శి: మూడు రాష్ట్రాలలో బిజెపి విజయకేతనం ఎగరవేయడంతో దర్శి పట్టణంలో ఆనందం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు కార్యకర్తలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద బిజెపి నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగ మూడు రాష్ట్రాలలో బిజెపి పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగభూషణ ఆచార్య ఆధ్వర్యంలో అభిమానులు కార్యకర్తలు భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు నిర్వహించారు.