రాయదుర్గం: పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఇన్చార్జ్ మంత్రి టిజి భరత్
అనంతపురం జిల్లా ఇంచార్జ్ మంత్రి టిజి భరత్ రాయదుర్గంలో జరిగే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు పట్టణానికి చేరుకున్నారు. గురువారం మద్యాహ్నం R&B అతిథిగృహం వద్ద ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం నగరేశ్వర స్వామి ఆలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి దేవికి పూజలు చేశారు. జంబుకేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న దశ విద్య హోమాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే రుద్రయ్య శెట్టి కళ్యాణమండపంలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు స్థానిక MLA కాలవశ్రీనివాసులు, ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నాగళ్ళిరాజు పాల్గొన్నారు.