మార్కాపురం: విద్యాసంస్థల బస్సుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడించిన డి.టి.ఓ రాంబాబు
విద్యాసంస్థల బస్సుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి స్కూల్ బస్సు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని జిల్లా రవాణా అధికారి రాంబాబు స్పష్టం చేశారు. మార్కాపురం డిటిఓ కార్యాలయంలో జిల్లాలోని విద్యాసంస్థల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బస్సుల్లో వేగ నియంత్రణ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అగ్నిమాపక పరికరాలు ఉండాలన్నారు.