గిద్దలూరు: కంభం మండలం నడింపల్లి గ్రామంలో రెండు ఇళ్లల్లో చోరీ చేసిన దొంగలు, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం మండలం నడింపల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. 2 ఇళ్లల్లో చోరీలు చేయడమే కాకుండా అంగన్వాడి కేంద్రంలో చోరీ చేసేందుకు ప్రయత్నించారు. గ్రామానికి చెందిన పద్మావతి, ఇమాంబి ఇళ్లల్లోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి 10 గ్రాముల బంగారం 150 వెండి, రూ.5000 వేలు నగదును దొంగలు అపహరించారు. వ్యక్తిగత పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్ళిన క్రమంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. అలానే అంగన్వాడి కేంద్రంలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టారు. అందులో ఎటువంటి వస్తువులు లేకపోవడంతో దొంగలు వెనుదిరిగారు.