గిద్దలూరు: రెండు కిడ్నీలు చెడిపోయి దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న గిద్దలూరు ABM పాలెం కు చెందిన మౌలాబి
మార్కాపురం జిల్లా గిద్దలూరు ABM పాలెం కు చెందిన మౌలాబీ తన రెండు కిడ్నీలు చెడిపోయి దాతల సహాయం కోసం ఎదురుచూస్తుంది. వికలాంగుడైన తన కొడుకుకు వచ్చే పెన్షన్తో పాటు తనుకు వచ్చే పెన్షన్తో ప్రస్తుతం వైద్యం చేయించుకుంటూ కుటుంబ పాలన పోషించుకుంటున్నామని వచ్చే డబ్బులు తమకు వైద్యానికి సరిపోవడంలేదని బాధితురాలు వాపోయింది. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ తల్లి వైద్యానికి సహాయం అందించాలని మౌలాభి కుమారుడు దస్తగిరి దాతలను వేడుకుంటున్నాడు.