గిద్దలూరు: కొమరోలు మండలం తాటిచెర్ల మోటు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆటో ఢీకొని పాదచారుడు మృతి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆటో ఢీకొని పాదచారుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడు నంద్యాల జిల్లా డోన్ గ్రామానికి చెందిన రామాంజనేయులుగా ఎస్సై నాగరాజు గుర్తించారు. గాయపడ్డ సమయంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృత్ దేహాన్ని రామాంజనేయులు కుటుంబ సభ్యులకు అందజేస్తామని ఎస్సై తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.