కొండపి: సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో విద్యుత్ శాఖతో సచివాలయ ఎలక్ట్రిషన్ శేషాద్రి మృతి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో శేషాద్రి అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలో మరమ్మతులు నిర్వహించేందుకు విద్యుత్ స్తంభానికి శేషాద్రి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ స్తంభం పైనే మృతి చెందాడు. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.