రాయదుర్గం: జిల్లా ప్రజల తలరాతలు మార్చేందుకు ప్రభుత్వం కృషి : ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా రైతుల తలరాతలు మార్చేందుకు టిడిపి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రాయదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రగతి పండుగలలో బాగంగా డి హిరేహాల్ మండలం గొడిసెలపల్లిలో నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రానికి మంత్రినైనా జిల్లాకు కూలిగా పని చేస్తానని మరోసారి నొక్కి చెప్పారు. తుంగభద్ర డ్యాం 18 గేట్లను వంద రోజుల్లో కొత్తవి బిగించామని వెల్లడించారు.