రాయదుర్గం: లింగదహాల్ లో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
బొమ్మనహాల్ మండలంలోని లింగదహాల్ గ్రామంలో బోయ అడివప్ప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసుల వివరాల మేరకు తాగుడుకు బానిసైన ఇతని తీరు నచ్చక బార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంటిలో ప్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో బొమ్మనహాల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.