మార్కాపురం: సమస్యలను పరిష్కరించాలని విత్తన డీలర్ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మండల ఎరువులు పురుగుల మందులు విత్తన డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ విజయ సునీత కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ... ఎరువుల బలవంతపు అనుసంధానం పై సంపూర్ణ నిషేధం విధించాలన్నారు. సబ్సిడీ ఎరువులతో పాటు అవసరం లేని ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయమని డీలర్లను బలవంతం చేయకుండా ఎరువుల తయారీ కంపెనీలను నిషేధించాలన్నారు. ఉత్తరప్రదేశ్ అనుసరించిన నమూనాను ప్రకారం దేశవ్యాప్తంగా నిషేధించాలన్నారు.