మార్కాపురం: ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన వివాదం పరిష్కరించినట్లు తెలిపిన జిల్లా అటవీశాఖ అధికారి అబ్దుల్ రవుఫ్
మార్కాపురం జిల్లా దోర్నాల అడవి ప్రాంతంలో వెలసిన ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శన నిలిపివేత ప్రచారంపై జిల్లా అటవీశాఖ అధికారి మహమ్మద్ అబ్దుల్ రవుఫ్ స్పందించారు. అటవీ శాఖ సిబ్బంది చెంచు డ్రైవర్ల మధ్య వివాదం చర్చల ద్వారా పరిష్కారమైందన్నారు. యాత్రికులకు ఇబ్బందులు లేకుండా ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనం తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.