మార్కాపురం: అతివేగంగా వెళ్తున్న ఆర్వీటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు
విజయవాడ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో భాగంగా బెంగళూరు నుండి మార్కాపురం వస్తున్న ఆర్వీటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్ణీత వేగపరిమితిని మించి ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మార్కాపురం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు వాహనాన్ని తనిఖీ చేశారు. తనిఖీలో కూడా వేగపరిమితిని దాటి నడిపినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేసు నమోదు చేసి బస్సు సీజ్ చేసినట్లు మాధవరావు తెలిపారు.