రాయదుర్గం: దర్నా, రాస్తారోకోలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు : సిఐ జయనాయక్
ఇకమీదట రాయదుర్గం పట్టణంలో దర్నా, రాస్తారోకోలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ జయనాయక్ హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వేరువేరు ప్రాంతాలలో గొడవపడి రాయదుర్గం ఆసుపత్రికి చికిత్స కోసం వస్తున్నారని, అక్కడ అనవసరంగా ధర్నాలు చేస్తూ రోగులకు అసౌకర్యం కలగజేస్తున్నారని తెలిపారు. 30 పోలీసు యార్డ్ అమలులో ఉందని రోడ్డుపై ధర్నాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.