కొండపి: సింగరాయకొండ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను గురువారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి పరిస్థితిలకు అడిగి తెలుసుకున్నారు. సెలవుల రోజుల్లో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా తమ చదువును మెరుగుపరచుకోవాలన్నారు. అలాగే ఒకటి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ మారుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా బాగా చదువుకోవాలని విద్యార్థులకు తెలిపారు