కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో పలు విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన డీఎస్సీ ని రద్దు చేసి మెగా డీఎస్సీ నిర్వహించారు. ప్రచార ఆర్భాటాలతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారన్నారు. మెగా డీఎస్సీ కాదు దగా డిఎస్సీ అని విమర్శించారు.