కళ్యాణదుర్గం: చిన్న బలపం పల్లి లో బోరు ఏర్పాటు చేయించి తాగునీటి సమస్య ను పరిష్కరించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
సెట్టూరు మండలం బలపం పల్లి గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొనింది. ఇటీవల గ్రామస్తులు ఈ విషయాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి గ్రామంలో బోరు ఏర్పాటు చేయించారు. సమృద్ధిగా నీళ్లు పడ్డాయి. తాగునీటి సమస్య పరిష్కారం అయింది. దీంతో ఎమ్మెల్యేకు గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు మాట్లాడారు. కొన్నేళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడ్డామన్నారు. అయితే ఎమ్మెల్యే స్పందించి బోరు ఏర్పాటు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించారన్నారు. ఎమ్మెల్యేకి రుణపడి ఉంటామన్నారు.