కొండపి: సింగరాయకొండలో గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో, ఇద్దరు వృద్ధులు మృతి, ఒకరికి గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలు ఇద్దరు వృద్ధులు సంఘటన స్థలంలోని మృతి చెందగా ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మూలగుంటపాడు గ్రామానికి చెందిన వీరు వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తు ప్రమాదానికి గురయ్యారు.