రాయదుర్గం: పట్టణంలోని కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 919 కేసులు పరిష్కారం
చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దని రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎన్ రమ్య తెలియజేశారు. రాయదుర్గం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో 919 కేసులు పరిష్కారం అయినట్లు తెలియజేశారు. ఇందులో అత్యదికంగా 793 ఎస్టిసి కేసులు పరిష్కారం చేశామన్నారు. పోలీసు అధికారులు, అడ్వకేట్ లు పాల్గొన్నారు.