రాయదుర్గం: కణేకల్లు లో గ్యాస్ గోడౌన్ తనిఖీ చేసిన ఆర్డీఓ
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో గ్యాస్ సరఫరా చేయాలని కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. కనేకల్ లో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉన్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, పంపిణీ విధానం, రికార్డులు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ పరికరాల నిర్వహణ, గోడౌన్‌లో సిలిండర్ల నిల్వ విధానం తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా గోడౌన్ నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. గ్యాస్ పంపిణీ సమయంలో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.