మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ... బస్టాండులో సుమారు 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. క్వాలిటీ కలిగిన కెమెరాలతో దొంగతనం జరగడానికి వీల్లేదని జరిగిన 100% గుర్తించి పట్టుకోవడానికి వీలవుతుందన్నారు. గతంలో జరిగిన దొంగతనాలపై దర్యాప్తు జరుగుతుందని వారిని త్వరలో పట్టుకుంటామన్నారు.