రాయదుర్గం: ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గా కొట్రేష్ ఎన్నిక
AIYF జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గా రాయదుర్గానికి చెందిన కావలి కోట్రేష్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. నిరుద్యోగం, విద్య, వైద్యం, ఉపాధిపై కొట్రేష్ చేసిన పోరాటాలను గుర్తించి రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని కొట్రేష్ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీ గా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, మెగా డీఎస్సీలో అవకతవకలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.