మార్కాపురం: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాశీనాథ్
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గం ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి చెందిన ప్రచార కోఆర్డినేటర్ బాల నాగేంద్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరియు వారి కుటుంబం పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. గతంలో బాలినేని ప్రశంసించిన బాల నాగేంద్ర కొద్ది రోజుల్లోనే తన వైఖరిని మార్చుకోవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఎవరో ప్రభావం వల్ల ఇతర ప్రయోజనాల కోసం ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు