మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వేడుకలు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పిస్తామన్నారు. అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.