మార్కాపురం: జిల్లా కేంద్రంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభానికి మరమ్మత్తులు చేసిన అధికారులు
మార్కాపురం జిల్లా వేములకోట కాలనీ సమీపంలో ప్రభుత్వ వైద్యశాల వద్ద విద్యుత్ స్తంభం వంగిపోయిందని వాట్సప్ గ్రూపులలో వైరల్ గా మారింది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. లైన్ ఇన్ ఎక్ష్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం జెసిబి సహాయంతో వంగిన విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టి మరమ్మత్తులను చేపట్టారు. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.