మార్కాపురం: మార్కాపురం జిల్లా నూతన ట్రాన్స్ కో ఎస్ఇ గా బాధ్యతలు స్వీకరించిన కరీం
ఏపి సిపిడిసిఎల్ మార్కాపురం జిల్లాకు తొలి ట్రాన్స్ కో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎస్ ఇ) గా ఎస్ ఏ కరీం బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కరీం కు ఇఇ నాగేశ్వర రావు, ఏడిఇ షియా నాయక్ తో పాటు పలువురు ట్రాన్స్ కో అధికారులు బొకే అందజేసి అభినందలు తెలిపారు. అధికారుల సమన్వయంతో నాణ్యమైన విద్యుత్ ను అందించి వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.