ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పలు తీర్మానాలు
ఉరవకొండ మండలం లో అతి పవిత్రమైన పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు సమావేశం నిర్వహించారు. ఆలయ చైర్మన్ నాగరాజు, సహాయక కమిషనర్ నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ హాజరయ్యారు. రథానికి మరమ్మతులు, కోనేరుకు ఫెన్సింగ్, వృద్ధులు, దివ్యాంగుల కోసం రైలింగ్, విద్యుత్తు, తాగునీరు, చలువ పందిళ్లు వంటి వాటిపై తీర్మానాలు చేశారు.