రాయదుర్గం: భారీ వర్షాలకు పలుచోట్ల జలమయం, రోడ్డు పై విరిగిపడిన చెట్లు
రాయదుర్గం నియోజకవర్గంలోని రాయదుర్గం, గుమ్మగట్ట ప్రాంతాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కుంటల్లో నీరు చేరాయి. రాయదుర్గం పట్టణంలోని షాదిమహల్ సెయింట్ పాల్ స్కూల్ ఏరియాలో మోకాలి లోతు నీరు నిలిచి అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితిలో తీవ్ర అసౌకర్యంగా మారింది. బళ్ళారి రోడ్డులో పెద్ద చెట్టు కొమ్మలు విరిడి రోడ్డుపై పడ్డాయి. గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. గుమ్మగట్ట రోడ్డులో 75 వీరాపురం సమీపంలో వేపచెట్టు విరిగి రోడ్డుపై పడింది.