గిద్దలూరు: గిద్దలూరు మండలం దిగువమెట్ట చెంచు కాలనీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట చెంచు కాలనీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియలేదని మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.