రాయదుర్గం: పట్టణంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి
మాజీ ఉప ప్రధాని సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం రాయదుర్గంలో టిడిపి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం, టెంకాయ కొట్టి పూజా చేయగా SC సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున, మాజీ కౌన్సిలర్ ఆనంద్ టిడిపి పట్టణ కార్యదర్శి అగ్రహారం కిరణ్, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు.