రాయదుర్గం: పట్టణంలోని కణేకల్లు రోడ్డులో పవర్ ట్రాన్స్ మిషన్ యాక్సిల్ తెగి ఆగిపోయిన ఆర్టీసి బస్సు, ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
కండీషన్ లేని RTC బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కణేకల్లు రోడ్డులో ఉరవకొండ డిపోకు చెందిన AP02 Z0504 బస్సు పవర్ ట్రాన్స్ మిషన్ యాక్జిల్ తెగి కిందపడిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సు ఆపడం వల్ల ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఇటీవల రాయదుర్గం, ఉరవకొండ డిపోలకు చెందిన పలు బస్సులు ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్ అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు విసుగు చెందుతున్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో వెంటనే కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.