మార్కాపురం: చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ మార్కాపురం జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన
ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ నుండి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు నిరసన తెలిపి డి.ఎస్.పి నాగరాజుకు వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు రమణ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సును కోరి వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అమానుష సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు