రాయదుర్గం: ఓబుళాపురం గ్రామంలో చాలా కాలంగా మూతపడిన శుద్ధజల కేంద్రం ఎట్టకేలకు పునఃప్రారంభం
డి.హిరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో చాలా కాలంగా మూతపడిన శుద్ధజల తాగునీటి కేంద్రం శనివారం పునఃప్రారంభమైంది. యంత్రాలకు మరమత్తులు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చారు. శనివారం ఉదయం ఈఓపిఆర్డీ యోగానందరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, టిడిపి గ్రామ అధ్యక్షులు తాయప్ప ఈ ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దుర్గప్ప, బస్ప, బసవరాజు, వన్నూరస్వామి, తిప్పేస్వామి, కొల్లారప్ప, రాము తదితరులు పాల్గొన్నారు.