విశాఖపట్నం: విశాఖ కనకమహాలక్ష్మి ఆలయంలో ఘనంగా తులసీ దళ అర్చన
విశాఖపట్నం బురిజిపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శనివారం తులసీ దళ అర్చన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.