కొండపి: కొండపి నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై త్యాగరాజు, అసాంఘిక కార్యకలాపాలను అరికడతానని వెల్లడి
ప్రకాశం జిల్లా కొండపి నూతన ఎస్సైగా త్యాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో దొనకొండ ఎస్సైగా పనిచేసిన త్యాగరాజు బదిలీపై కొండపికి వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై త్యాగరాజు మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా తన వంతు బాధ్యత నిర్వహిస్తారని ఎస్సై అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐకి శుభాకాంక్షలు చెబుతూ సిబ్బంది ఆయనను పరిచయం చేసుకున్నారు.