యర్రగొండపాలెం: దోర్నాలలో ఈనెల 21 ఆర్టీసీ బస్టాండుకు శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల ఆర్టీసీ బస్టాండ్కు ఈనెల 21న శంకుస్థాపన చేయనున్నట్లు టిడిపి వైపాలెం ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బస్టాండ్ ను స్వయంగా పరిశీలించడం జరిగిందన్నారు. బస్టాండ్ నిర్మాణంతో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయి అని తెలిపారు.