గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంలో ఈనెల 9వ తేదీన హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంలో ఈనెల 9వ తేదీన భార్యపై అనుమానంతో రోకలబండతో దాడి చేసి హతమార్చిన నిందితుడు గంగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. బుధవారం సీఐ సురేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అనుమానంతోని భార్యను హత్య చేశాడని కోర్టుల ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు.