రాయదుర్గం: దేవిరెడ్డిపల్లి వద్ద బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన గోపులాపురం వ్యక్తి
కణేకల్లు మండలం గోపులాపురం గ్రామానికి చెందిన హరిజన చంద్ర అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు గుమ్మగట్ట మండలం దేవిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రాయదుర్గం నుండి బైక్ పై మారెంపల్లి మీదుగా గోపులాపురం వెళ్లాల్సి అతను దారితప్పి దేవరపల్లి వైపు వెళ్లాడు. వర్షానికి రోడ్డుపై పడిన చెట్లు గమనించక వాటిని డీకొని కిందపడ్డాడు. అతన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.