మార్కాపురం: చెన్నకేశవ స్వామి కళ్యాణం వేడుకలో పాల్గొన్న ఎంపీ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణం ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించారు.