గిద్దలూరు: కంభం, బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
మార్కాపురం జిల్లాలో మంగళవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యటించారు. బేస్తవారిపేట, కంభం పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రతిరోజు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయడంతో పాటు ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించామన్నారు. సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్లు వంటి అంశాలపై దృష్టి సారించి క్రైమ్ పర్సంటేజ్ ని తగ్గిస్తున్నామన్నారు. ప్రజలకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.