విశాఖపట్నం: విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
విశాఖపట్నం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఆయుష్ హోమం మరియు శనివారం తులసిదళ అర్చన నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు బి.ఎన్.ఎస్. భట్టర్ మరియు వేద పండితుల పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి.