మార్కాపురం: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించిన పోలీసు శాఖ వారు, కృతజ్ఞతలు తెలిపిన మొబైల్ ఫోన్ల యజమానులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టి బాధితులకు బుధవారం పోలీసులు అప్పగించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనలు సలహాల మేరకు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారి ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఐటి కోర్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించారు. ప్రజలకు కూడా ముక్కు మొహం తెలియని వారి వద్ద మొబైల్ ఫోన్లు సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయవద్దన్నారు. మొబైల్ ఫోన్లు అప్పగించిన పోలీసు శాఖ వారికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.