దర్శి: మారెళ్ళ గ్రామంలో బ్రహ్మంగారి గుడి వద్ద పడిపోయి నిలబడిన రావి చెట్టుకు ప్రత్యేక పూజలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన బ్రహ్మంగారి గుడి వద్ద గ్రామ ప్రజలు పసుపు కుంకుమ కలిపిన పవిత్ర జలాలతో రావి చెట్టు వద్దకు ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. హోమానికి ఉపయోగించిన రావి చెట్టు పడగొట్టిన తర్వాత తిరిగి నిలబడినట్లు కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భక్తులు దీనిని దైవ మహిమ గా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా పరిశీలించినట్లు స్థానికులు తెలిపారు.