రాయదుర్గం: బాద్యతతో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : డి.హిరేహాల్ లో ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత బాధ్యతతో చేపట్టాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జిలు, బూత్ లెవెల్ ఏజెంట్లకు డి.హిరేహాల్ మండల కేంద్రంలో బుధవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 68 శాతం మాత్రమే ఓటర్ల సవరణ జాబితా మ్యాపింగ్ జరిగిందని వివరించారు. మండలాలు, గ్రామాలు, వార్డు, పోలింగ్ బూతు వారీగా పూర్తయిన మ్యాపింగ్ వివరాలను, లోటుపాట్లను ఆయన సమగ్రంగా వివరించారు. తక్కువ మ్యాపింగ్ జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.