రాయదుర్గం: డ్రైడే పాటించడం ద్వారా దోమల పెరుగుదలకు చెక్ : మలేరియా ఆఫీసర్ నాగేంద్రప్రసాద్
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే పాత్రలు, ట్యాంకులు వారానికి ఒకసారి ఖాళీ చేసి అరగంట ఆరబెట్టి డ్రై డే పాటించడం ద్వారా దోమల పెరుగుదలను సమర్థంగా అరికట్టవచ్చని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం రాయదుర్గం పట్టణంలోని రోడ్డు 5 వ వార్డు ఓబుళాచారి రోడ్డులో దోమల నివారణపై స్థానికులకు అవగాహన కల్పించారు. పలు చోట్ల నిల్వ నీటిలో లార్వా ను గుర్తించి పారబోయించారు పెరుగుతున్న వేడి కారణంగా దోమల జీవచక్రం వేగంగా పూర్తవుతూ వాటి సంఖ్య అధికమవుతోందని, అందువల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ దోమల సంఖ్య తగ్గకుండా మరింతగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.