యర్రగొండపాలెం: టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిషన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఆయనకు సమర్పించారు. సంబంధిత అధికారులకు ఆయన ఫోన్ చేసి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.