మార్కాపురం: చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా న్యూ కేటగిరి విభాగం ఎడ్ల పందాల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంగోలు జాతి ఎడ్ల పోటీ పందాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. న్యూ కేటగిరి విభాగం పోటీలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బండ కమిటీ ఆధ్వర్యంలో పోటీలో పాల్గొన్న వారికి జ్ఞాపికలు అందజేస్తున్నారు. పోటీలను తిలకించేందుకు రైతులు స్థానిక ప్రజలు తరలి వచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.