దర్శి: దర్శి సర్కిల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 12 మందికి 30 రోజులు జైలు శిక్ష పదివేలు జరిమానా
Darsi, Prakasam | Jun 30, 2026 ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురు పట్టుబడ్డారు. వారిని దర్శికోర్టులో హాజరు పరచగా 12 మందికి 30 రోజులు జైలు శిక్ష పదివేల రూపాయలు జరిమానా విధించినట్లు సిఐ రామారావు తెలిపారు. బహిరంగ మద్యం తాగిన పలువురికి జరిమాన విధించారు. ప్రజల భద్రత దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.